విద్యార్థికి ఆర్థిక సహాయం అందించిన జనసేన నేత అప్పారావు

సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం అంచుల వారి పాలెం గ్రామానికి చెందిన హనుమాన్ బాబు కొడుకు వొడిచర్ల వెంకట శివరాం విద్యలో బాగా రాణిస్తూ ఉండగా ఆర్థికంగా వెనుకబాటులో ఉండటంతో రాజు పాలెం మండల అధ్యక్షులు తోట నరసయ్య తెలియజేయగా, ప్రతిభ కలిగిన విద్యార్థులకు ఆర్థిక ఇబ్బందులు కారణం కాకూడదనే ఉద్దేశంతో సత్తెనపల్లి నియోజవర్గం జనసేన పార్టీ నాయకులు బొర్రా వెంకట అప్పారావు, ఆ విద్యార్థి చదువుల నిమిత్తం ఆర్థిక సహాయం అందించారు. భవిష్యత్తులో ఎటువంటి సహయానికైనా సంప్రదిస్తే తాను సిద్ధంగా ఉన్నానని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో రాజుపాలెం మండలం వైస్ ప్రెసిడెంట్ బత్తుల హనుమంతరావు, సత్తెనపల్లి రూలర్ మండలం అధ్యక్షుడు నాదెళ్ల నాగేశ్వరావు, ముప్పాళ్ళ మండల అధ్యక్షుడు సిరిగిరి పవను, షేక్ జానీ పీర్, షేక్ సైదా, పార్టీ నాయకులు కార్యకర్తలు జనసైనికులు పాల్గొన్నారు.