నైరుతి రైల్వేలో గ్రూప్ సీ పోస్టులు

నైరుతి రైల్వే గ్రూప్ సీ పోస్టుల్ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేస్తున్న పోస్టులు ఇవి. కాబట్టి ఆయా క్రీడల్లో రాణించినవారు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.rrchubli.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. దరఖాస్తు ఫామ్ ఇదే వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని, పూర్తి చేసి, చివరి తేదీ లోగా నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు పంపాలి.

మొత్తం ఖాళీలు- 21

అథ్లెటిక్స్- 5

బ్యాడ్మింటన్- 2క్రికెట్- 3

వెయిట్‌లిఫ్టింగ్- 2

టేబుల్ టెన్నిస్- 1

హాకీ- 4

స్విమ్మింగ్- 2

గోల్ఫ్- 2

దరఖాస్తు ప్రారంభం- 2020 నవంబర్ 28

దరఖాస్తుకు చివరి తేదీ- 2020 డిసెంబర్ 28

వయస్సు- 18 నుంచి 25 ఏళ్లు

విద్యార్హతలు- ఇంటర్ పాస్ కావడంతో పాటు సంబంధిత క్రీడల్లో రాణించాలి.

దరఖాస్తు ఫీజు- రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.250.

దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:

The Assistant Personnel Officer,

Head Quarter,

Railway Recruitment Cell,

2nd Floor,

Old GMs Office Building,

Club Road,

Hubballi-580023