సిద్ధవటం మండలాన్ని యధాతధంగా కడపలోనే ఉండాలి: జనసేన డిమాండ్

కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండల కేంద్రంలో శుక్రవారం సిద్ధవటం పోలీస్ లైన్ క్రాస్ నుండి బస్టాండ్ వరకు జనసేన కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్ధవటం మండలాన్ని యధాతధంగా కడపలోనే ఉంచాలని ఇప్పటికే సిద్ధవటం మండలం అభివృద్ధికి నోచుకోలేదని ముఖ్యమంత్రి స్పందించి మా మండలాన్ని అన్యాయం చేయకుండా కడపలోని ఉంచాలని వారు వినాదాలు చేశారు సిద్ధవటం బస్ స్టాండ్ కూడలి నందు మానవహారం చేసి నిరసన వ్యక్తం చేశారు పార్టీలకు అతీతంగా అందరూ రాజీనామా చేయాలని వారు ప్రజా ప్రతినిధులను కోరారు ఈ సందర్భంగా మీడియా వరంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి మా మండలం చాలా వెనుకబడి ఉంది రాయచోటిలో కలిపితే దాదాపు 75 కిలోమీటర్ల వ్యవధిలో చాలా ఇబ్బంది పడతారు అని రాష్ట్ర ప్రభుత్వం ఒక సారి ఆలోచించి పునః పరిశీలించి సిద్ధవటం మండలాన్ని యధాతధంగా కడపలో ఉండాలని జనసేన మండల అధ్యక్షుడు కొట్టే రాజేష్ పసుపులేటి కళ్యాణ్ విన్నవించుకున్నారు ఒక 100 మందితో ర్యాలీ నిర్వహించారు.