నాదెండ్ల మనోహర్ గారి పర్యటన కై అమలాపురం నియోజకవర్గ ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు గారి ఆధ్వర్యంలో సమావేశం

అమలాపురం నియోజకవర్గంలో ఈ నెల 29,30 వ తేదీలలో పర్యటించనున్న జనసేనపార్టీ పొలిటికల్ అప్ఫైర్స్ కమిటీ చైర్మన్ గౌ౹౹శ్రీ౹౹ నాదెండ్ల మనోహర్ గారి పర్యటన కై అమలాపురం నియోజకవర్గ ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు గారి ఆధ్వర్యంలో నియోజకవర్గ కార్యకర్తలు సమావేశం నిర్వహించబడింది ఈ సందర్భంగా రాజబాబు గారు మాట్లాడుతూ 29వ తేదీ ఉదయం 9 గంటలకు అనాతవరం నుండి ప్రారంభమై ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి, బట్టుపాలెం,సూదా పాలెం మీదుగా సమనస లో ఇటీవల భారీ వర్షాలకు దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించి తదుపరి ఎర్రవంతెన, అమలాపురం హైస్కూల్ సెంటర్ మీదుగా ఇందుపల్లి లోని A1 కన్వెన్షన్ కళ్యాణమండపం నందు జనసేనపార్టీ లో పలువురి చేరికలు కార్యకర్తల సమావేశం జరుగును. తదుపరి సాయంత్రం 6గంటలకు హోటల్ సామ్రాట్ నందు కార్యకర్తలకు అందుబాటులో ఉందురు.ఈ అవకాశాన్ని ప్రతీ జనసేన నాయకులు, మండల అధ్యక్షులు,కౌన్సిలర్లు,ఎంపీటీసీలు,
సర్పంచ్ లు,ఉప సర్పంచ్ లు,జనసైనికులు, వీరమహిళలు సద్వినియోగపరుచుకోని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాజబాబు గారు పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *