అమ్మ కోవిడ్ -19 హోమ్‌కేర్ పథకo

తమిళనాడు ముఖ్యమంత్రి కె. పళనిస్వామి శుక్రవారం అమ్మ కోవిడ్ -19 హోమ్‌కేర్ పథకాన్ని ప్రారంభించారు, దీని ద్వారా మందులు, పల్స్ ఆక్సిమీటర్ మరియు డిజిటల్ థర్మామీటర్‌తో కూడిన రూ.2,500 ప్యాకేజీని స్వీయ గృహ నిర్బంధంలో ఉన్నవారికి విక్రయిస్తారు.

ఈ పథకంలో పల్స్ ఆక్సిమీటర్, డిజిటల్ థర్మామీటర్, 14 ఫేస్ మాస్క్‌లు, చేతులు కడుక్కోవడానికి ఒక సబ్బు, హెర్బల్ పౌడర్, 60 హెర్బల్ మాత్రలు, 14 జింక్ టాబ్లెట్లు ఉన్నాయి. 14 మల్టీ-విటమిన్ టాబ్లెట్లు మరియు కోవిడ్ -19 బుక్‌లెట్ కూడా ఉంటాయి.

ఈ ప్యాకేజీ ఇక్కడి ప్రభుత్వ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో లభిస్తుంది.