అమ్మ పేరుతో ఒక మొక్క కార్యక్రమం

*కార్యక్రమంలో కిరణ్ కుమార్ రెడ్డి, దారం అనిత పాల్గొనడంతో ఉత్సాహం

మదనపల్లి మండలం, రామిరెడ్డి గారి పల్లిలో ముత్యాలమ్మ గుడి వద్ద ‘అమ్మ పేరుతో ఒక మొక్క’ కార్యక్రమం వైభవంగా నిర్వహించబడింది. బీజేపీ గ్రామీణ అధ్యక్షుడు తరిగొండ వెంకట్రమణారెడ్డి ఆహ్వానంతో ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొనగా, ఆయనతో కలిసి జనసేన రాయలసీమ రీజనల్ కో ఆర్డినేటర్ శ్రీమతి దారం అనిత కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ – “కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటించడం గర్వకారణం” అని తెలిపారు. సహజ వాతావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు.

Share this content:

Post Comment