మరొక విజయం సాధించిన పాటంశెట్టి

జగ్గంపేట నియోజకవర్గం, వెంగయ్యమ్మపురం గ్రామంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపాధి హామీ పథకంలో శ్రమించే కూలీలకు రోజుకు వంద రూపాయలు కూలి, ఇంటిదగ్గర ఉంటూ దొంగ మస్తర్లు వేసుకుంటున్న వైసీపీ నాయకులకు, చనిపోయిన మరియు గ్రామంలో లేనివారికి కూడా రోజుకు 250 రూపాయలు తీసుకుంటూ పేదవాళ్ల శ్రమను దోచుకుంటున్నారు. రోజుకి 100 రూపాయల కూలి డబ్బులతో కుటుంబం అంతా ఏ రకంగా జీవించాలి మా నోటి కాడ అన్నం లాక్కుంటున్నారు మాకు న్యాయం చేయండని ఎదురుతిరిగిన కూలీలను వైసిపి నాయకులు, స్థానిక అధికారులు ఇష్టముంటే చేయండి లేకపోతే పోండి అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. మనకు న్యాయం జరిగేది జనసేన పార్టీతోనే అని గ్రహించిన ఉపాధి కూలీలు మాకు అండగా ఉండాలి న్యాయం చేయాలని కోరారు బాధితులకు న్యాయం చేయండని అధికారులను కోరినా న్యాయం జరగకపోవడం వల్ల తప్పని పరిస్థితుల్లో శ్రమజీవులకు న్యాయం జరగడం కోసం గాంధేయమార్గంలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాము మధ్యలో పోలీస్ వారికి వచ్చిన విపరీతమైన ఒత్తిడి వల్ల దీక్ష భగ్నం చేయడానికి చాలా ప్రయత్నం జరిగింది బాధితులు అంతా నాకు రక్షణ కవచంలా ఉండి పోలీసు వారిని వెనుతిరిగేలా తిరుగుబాటు చేశారు అనంతరం అధికారులు గ్రామంలో న్యాయ విచారణ చేశారు వారం రోజుల అనంతరం నిన్న రాత్రి 10 గంటలకు జిల్లా కలెక్టర్ ఉత్తర్వులతో జిల్లా అధికారులు దీక్షా శిబిరం వద్దకు వచ్చారు అనంతరం జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేష్ గారు, పీఏసీ సభ్యులు శ్రీ పంతం నానాజీ గార్ల చేతుల మీదుగా మాకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు జిల్లా కలెక్టర్ గారి ఉత్తర్వులలో అవినీతికి పాల్పడిన 14 మంది మేట్లను, ఫీల్డ్ అసిస్టెంట్ ని, టెక్నికల్ అసిస్టెంట్ ని సస్పెండ్ చేశారు ఇంజనీరింగ్ అసిస్టెంట్ నకు,ఏపీవో లకు షోకాజ్ నోటీసు ఇచ్చారు మరియు దొంగ మస్తర్ లు వేసుకుని శ్రమజీవుల కూలీ డబ్బులు కాజేసిన వైయస్సార్ పార్టీ నాయకులందరి దగ్గర నుండి డబ్బు రికవరీ చేసి వాస్తవంగా శ్రమించిన కూలీలందరికీ ఇచ్చేలా ఆర్డర్ ఇవ్వడం జరిగింది… నెల రోజుల క్రితం అచ్యుతాపురం గ్రామంలో 33కేవీ విద్యుత్ లైన్ సమస్య పరిష్కారం,నేడు వెంగయ్యమ్మపురం గ్రామంలో ఉపాధి కూలీల సమస్య-పరిష్కారంతో మా ప్రాంత ప్రజలంతా ప్రజా సమస్యల పరిష్కారం జనసేన పార్టీతోనే సాధ్యమని, జనసేన పార్టీని గెలిపించుకొని పవన్ కళ్యాణ్ ని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలంతా ఎదురుచూస్తున్నారని, మీ అందరి చల్లని ఆశీస్సులతో ఆరోగ్యంగా ఉన్నాము ప్రస్తుతం హాస్పిటల్ లో వైద్యం అందిస్తున్నారని, ఇది జనసేన విజయమని జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవీసూర్యచంద్ర అన్నారు.