AP: గ్రామ‌/వార్డు వాలంటీర్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి చెందిన నెల్లూరు, చిత్తూరు, శ్రీకాకుళం, తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాలోని వివిధ మండలాల్లో ఖాళీగా ఉన్న 1036 గ్రామ‌/ వార్డ్ వాలంటీర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఆసక్తి గల అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణులై.. స్థానిక వ్యక్తి అయి ఉండాలి. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. పూర్తి వివరాలకు https://gswsvolunteer.apcfss.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

మొత్తం ఖాళీలు: 1036

నెల్లూరు – 273

చిత్తూరు – 374

శ్రీకాకుళం – 85

తూర్పు గోదావరి – 65

గుంటూరు – 239

ముఖ్య సమాచారం:

పోస్టు పేరు: గ్రామ‌/ వార్డ్ వాలంటీర్‌

మొత్తం ఖాళీలు: 1036

అర్హ‌త‌: ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌, స్థానిక వ్య‌క్తి అయి ఉండాలి.

వ‌య‌సు: 18-35 ఏళ్ల మ‌ధ్య ఉండాలి

ఎంపిక విధానం: ప‌్ర‌భుత్వ ప‌థ‌కాల‌పై అవ‌గాహ‌న‌, గ‌త ప‌ని అనుభ‌వం, క‌మ్యూనికేష‌న్ స్కిల్స్‌, సాఫ్ట్ స్కిల్స్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులు ప్రారంభం: ఆగస్టు 28, 2020

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల అభ్యర్థులు సెప్టెంబర్‌ 1 తేదీ సాయంత్రం లోపు దరఖాస్తు చేసుకోవాలి. చిత్తూరు, తూర్పు గోదావరి జిల్లాల అభ్యర్థులు సెప్టెంబర్‌ 04, గుంటూరు జిల్లాల అభ్యర్థులు సెప్టెంబర్‌ 5వ తేదీ సాయంత్రంలోపు దరఖాస్తు చేసుకోవాలి.

వెబ్‌సైట్‌: https://gswsvolunteer.apcfss.in/