నిరుద్యోగులకు ఉచిత ఉపాధి శిక్షణ

నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పియించేందుకు టెక్ మహీంద్రా ముందుకు వచ్చింది. హైదరాబాద్‌ పరిధిలోని నిరుద్యోగ యువతకు టెక్‌ మహీంద్ర ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నాలుగు నెలల పాటు ఉచిత ఉపాధి శిక్షణను ఇస్తున్నట్లు సమన్వయకర్త శ్రీధర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సెస్సీ ఉత్తీర్ణులు, ఇంటర్‌, డిగ్రీ ఉత్తీర్ణులు-అనుత్తీర్ణులైన 10-27 ఏళ్ల వారికి కంప్యూటర్‌ బేసిక్స్‌, ఎంఎస్‌ ఆఫీస్‌, ఇంటర్నెట్‌ కాన్సెప్ట్స్‌, టైపింగ్‌, ఇంటర్వ్యూ సిల్క్‌, బీకాం ఉత్తీర్ణులకు ట్యాలీ ఈఆర్‌పీ 9, బేసిక్‌ అక్కౌంట్స్‌, అడ్వాన్స్‌డ్‌ ఎంఎస్‌ ఎక్సెల్‌లో శిక్షణ ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు వివరాలకు.. 76749 85461, 70935 52020 సంప్రదించాలని కోరారు.