రాజశేఖర్ ని పరామర్శించిన ఏపీ శివయ్య

తవణంపల్లి: తవణంపల్లి మండలం మండలాధ్యక్షుడు రాజశేఖర్ ని పరామర్శించిన చిత్తూరు ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి ఏపి శివయ్య. ఇటీవల ప్రమాదవశాత్తు గాయపడిన తవణంపల్లి మండలం జనసేన పార్టీ మండల అధ్యక్షుడు రాజశేఖర్ గాయపడ్డారు. ఆయనను, కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. తొందరగా కోలుకుంటారని తెలియజేశారు. రాబోవు ఎన్నికల్లో పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లి మండలం నుండి ఉమ్మడి అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించడంలో భాగస్వాములవుతారని ఏపీ శివయ్య తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు పూర్ణచంద్ర, మండల ప్రధాన కార్యదర్శి ఉదయ్, జనసేన నాయకులు లోహిత్ మండలంలోని జనసేన నాయకులు, కుమరేష్, హేమంత్ పాల్గొన్నారు.