విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయకుండా ఆపండిచిత్తూరు జనసేన

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు…
ఎంపీలు గళమెత్తకుంటే.. జన సైనికులే పోరాడుతారు..
జనసేన పార్టీ హెచ్చరిక..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయడానికి కుట్ర పన్నాయని, దానిని మన రాష్ట్ర ఎమ్మెల్యేలు, ఎంపీలు. అసెంబ్లీ, పార్లమెంట్లలో వ్యతిరేకిస్తూ నిరసన ప్లకార్డులతో డిమాండ్ చేయకుంటే, మా వల్ల కాదని వెన్ను చూపితే… తమ జనసైనికులు రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతామని.. జనసేన పార్టీ తిరుపతి అసెంబ్లీ ఇంచార్జ్ కిరణ్ రాయల్ వెల్లడించారు.. ప్రెస్ క్లబ్ లో సోమవారం మీడియాతో జనసేన నాయకులు రాజా రెడ్డి, సుమన్ బాబు అమృత, లతాదేవి, కీర్తన, ఆకుల వనజ, బాబ్జి, మునుస్వామి, సాయి దేవ్ తదితరులతో కలిసి కిరణ్ రాయల్ మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో .. తమ జనసేనాని పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు.. తాము ఈ ఉద్యమాన్ని మూడు రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, జనసైనికులు చేపట్టడం జరిగిందని, సోషల్ మీడియా మాధ్యమాలలో ఇప్పటికే 10 కోట్లకు పైగా ప్రజలు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ప్రైవేటీకరణ ఆపాలని ప్రజలు కోరుకుంటున్నారని ప్రజాప్రతినిధులను హెచ్చరించారు.

సీఎం జగన్ ఆయన స్వార్ధ ప్రయోజనాలకు విశాఖ ఫ్యాక్టరీని బలి చేస్తున్నారని ఆరోపించారు … ఈ ఫ్యాక్టరీ లో దాదాపు 20 వేల మంది కార్మికులు పని చేస్తున్నారని .. వారు రోడ్డున పడ్డతారని ఆవేదన వ్యక్తం చేశారు… స్పెషల్ స్టేటస్ పై పోరాటం పక్కన బెట్టి… ఏపీకి నష్టం చేసినట్లే… ఈ విశాఖ ఉక్కు ప్లాంట్లు కూడా ప్రైవేటీకరణ చేసి ప్రజలకు అన్యాయం చేయొద్దని డిమాండ్ చేశారు.