62వ వార్డ్ జనసేన అధ్యక్షులుగా సర్దార్ ఇంద్రజిత్ నియామకం

వైజాగ్: విశాఖ జిల్లా 62వ వార్డ్ జనసేన పార్టీ అధ్యక్షులుగా సర్దార్ ఇంద్రజిత్ నీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నియమించారు. ఈ సందర్భంగా ఇంద్రజిత్ మాట్లాడుతూ 2014 నుంచి పార్టీ కోసం కష్టపడుతున్న నన్ను నమ్మి ఇంత గొప్ప బాధ్యత అప్పజెప్పిన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, పశ్చిమ నియోజకవర్గ ముఖ్య నేత శ్రీ పీలా రామకృష్ణ గారికి ఇంద్రజిత్ ప్రత్యేక ధన్యవాదాలు, పార్టీ బలోపేతం కోసం నా వంతు శాయశక్తులా కష్టపడతను అని తెలిపారు.