రాజోలు: ఏపీయూడబ్ల్యూజే (ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్) ఆవిర్భావ దినోత్సవం ఆదివారం రాజోలులో ఘనంగా నిర్వహించారు. రాజోలు సిఐ టి.వి నరేష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిర్భావ దినోత్సవ కేక్ కట్ చేసారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జర్నలిస్ట్ వృతి కత్తి మీద సాము వంటిదని అన్నారు. వృత్తి రీత్యా జర్నలిస్ట్ లు ఎన్నో ఒత్తిడ్లు ఎదుర్కోవలసి వస్తుందని అన్నారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కి. సురేంద్ర కుమార్ మాట్లాడుతూ.. సుమారు 68 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతుందని అన్నారు. అనంతరం పాత్రికేయులు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాజోలు నియోజకవర్గ అధ్యక్షుడు తోట సత్యనారాయణ (చంటి) రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కె.సురేంద్ర కుమార్ జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా కార్యదర్శి పి. మణికంఠ, జిల్లా జాయింట్ సెక్రెటరీ దివ్వి రాఘవేంద్ర నాయుడు, జిల్లా కార్యవర్గ సభ్యులు సి హెచ్ మధుకుమార్, కోళ్ల దుర్గా ప్రసాద్, ముగ్గు ప్రసాద్, సీనియర్ పాత్రికేయులు వి. వి నాగేశ్వర రావు, నాగ శ్రీను, ఎం.వెంకటేశ్వర రావు, ఎం.ఎస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Share this content:
Post Comment