అన్న గెలవాలంటూ అర్చక స్వామి సైకిల్ యాత్ర!

ప్రత్తిపాడు మండలం శరభవరం గ్రామానికి చెందిన అర్చకుడు శ్రీ మామిడి వీరరాఘవులు పిఠాపురం నియోజక వర్గంలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం మార్చి 29 నుంచి సైకిల్ పై తిరుగుతూ గ్రామగ్రామాన ప్రచారం చేస్తున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్  చేబ్రోలులోని తన నివాసం దగ్గర శ్రీ వీర రాఘవులుని కలిసి ముచ్చటించారు. శ్రీ వీర రాఘవులు వ్యక్తిగత వివరాలు అడిగి తెలుసుకున్నారు.