పొన్నలూరు అభివృద్ధి విషయంలో బహిరంగ చర్చకు సిద్ధమా?

  • చిత్రగుప్తుడి దగ్గర ప్రజల యొక్క పాపపుణ్యాల బుక్ ఉన్నట్లుగా, కనపర్తి మనోజ్ కుమార్ దగ్గర జనసేన అనే బుక్ లో పొన్నలూరు వైసీపీ నాయకులు చేసిన అవినీతి రాసి ఉంది
  • పొన్నలూరు అభివృద్ధి విషయంలో బహిరంగ చర్చకు జనసేన సిద్ధం, మంత్రి గారు మరియు జడ్పీటీసీ సిద్ధమా?

కొండెపి: ప్రకాశం జిల్లా, పొన్నలూరు మండల కేంద్రంలో ప్రస్తుత జడ్పీటీసీ ఇంటికి సమీపంలో ఉన్న ప్రధాన రహదారిలో అతిపెద్ద గుంత ఏర్పడి వాహనాలు మరియు ప్రజలకు రాకపోకలకు ఆటంకం ఏర్పడింది, ఈ గుంత ఏర్పడి దాదాపు సంవత్సరం కాలం దాటింది, ఒక్క చోట కూడా డ్రైనేజీలు లేవు, వైసీపీ నాయకులు మరియు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు, పొన్నలూరు మండలంలో వైసీపీ నాయకులు అవినీతికి పాల్పడడంలో ప్రకాశం జిల్లాలోనే మొదటి స్థానంలో ఉన్నారు, జెడ్ పి స్థలం ఆక్రమించి కోట్లు దోచుకున్నారు, చెరువులో పచ్చని చెట్లు నరికి అమ్ముకుని లక్షల్లో సొమ్ము చేసుకున్నారు, కౌలు రైతులు పేరుమీద నకిలీ పాసు పుస్తకాలు సృష్టించి కోట్లు కొల్లగొట్టారు, జగనన్న కాలనీ పేరు చెప్పుకుని కోట్లు సంపాదించారు, సచివాలయాల నిర్మాణాలు పూర్తి చేయకుండా వచ్చిన సొమ్ము జేబులో వేసుకున్నారు, ప్రజలకు త్రాగునీరు అందిస్తామని వాటర్ ట్యాంకులకు బిల్లులు చేయించి మింగేసారు, రోడ్లు పేరు చెప్పుకుని కమిషన్లు దోచుకున్నారు, సంగమేశ్వరం ప్రాజెక్టు అడ్డుపెట్టుకుని కోట్లు సంపాదించారు, ఇసుక అమ్మకంలో జేబులు నింపుకుని ఉన్న జేబులు సరిపోక ఒక్కొక్క చొక్కాకి పది జేబులు బయటికి కనిపించకుండా కుట్టించుకున్నారు, రైతు భరోసా కేంద్రం పూర్తి చేస్తామని చెప్పి వైసీపీ నాయకులకు భరోసాని కల్పించుకున్నారు, పొలాలు స్థలాలు భూకబ్జాలు ఇలా చెప్పుకుంటూ పోతే పొన్నలూరు మండలంలో వైసీపీ నాయకులు చేసిన అవినీతి అక్రమాలు మరియు ఆక్రమణలు చాలా పెద్ద లిస్టు ఉంది, చిత్రగుప్తుడు దగ్గర ప్రజల యొక్క పాప పుణ్యాల లిస్ట్ ఉన్నట్లు నా దగ్గర వైసిపి నాయకుల అవినీతి లిస్ట్ జనసేన బుక్ లో రాసిపెట్టుకుని ఉన్నాను, జనసేన మరియు టిడిపి ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడగానే వైసీపీ నాయకుల అవినీతి నిరూపించి శిక్ష పడేలాగా చేస్తాను అని కొండపి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్ ఈరోజు పొన్నలూరు మండల కేంద్రంలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుని వారికి అండగా ఉండి, అధికారులు దృష్టికి తీసుకెళ్లి ఈ ప్రధాన రహదారి నిర్మాణాన్ని పూర్తి చేయిస్తాము అని భరోసాని కల్పించారు. ఈ కార్యక్రమంలో కర్ణ తిరుమలరెడ్డి, రామరాజు, నవీన్, ప్రేమ్, భరత్, బాలు, లక్ష్మణ్, చందు, రామకృష్ణ, రవిబాబు, సంతోష్, భానుచంద్ర జనసేన నాయకులు పాల్గొన్నారు.