సత్తెనపల్లి నియోజకవర్గంలో ఆపన్నులకు అండగా నిలుస్తున్న బొర్రా

సత్తెనపల్లి నియోజకవర్గం: జనసేన పార్టీ సత్తెనపల్లి నియోజకవర్గ నాయకులు బొర్రా వెంకట అప్పారావు ఆపన్నులకు, బాధాసర్పద్రష్ఠులకు అండగా ఉంటూ అటువంటి వారికి భరోసా ఇస్తున్నారు. కేవలం జనసైనికులకే కాకుండా నియోజకవర్గంలో ఎవరికి ఎటువంటి ఆపద వచ్చినా నేనున్నానంటూ ముందుకొచ్చి ఆపధ్భాంధవుడిలా చేయూతనివ్వడం చాలా శుభపరిణామం. రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ప్రజలకి ఆపదలో అండగా ఉంటున్నారో, సత్తెనపల్లిలో అప్పారావు కూడా అదే పంధాలో పయనించడం అభినందనీయం. అధినేత అడుగుజాడల్లో నడుస్తూ, అధినేత ఆశయ సాధనకు నడుం కట్టిన అప్పారావు సత్తెనపల్లి జనసేన పార్టీకి దొరికిన ఆణిముత్యం అని చెప్పడంలో అతిశయోక్తి ఎంతమాత్రం కాదు. ఇలాంటి నాయకుడి నాయకత్వంలో సత్తెనపల్లి జనసేన పార్టీ పూర్తి స్థాయిలో అభివృధ్ధి చెందగలదని ఆశించవచ్చు.