Pithapuram: బోన్ క్యాన్సర్ తో మరణించిన యువకుని కుటుంబానికి భరోసా

పిఠాపురం యు కొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామం జగ్గరాజు పేటలో ఇటీవల కొన్ని రోజుల క్రితం బోన్ క్యాన్సర్ తో మరణించిన యువకుడు
పిరమల్ల ప్రసాద్(19) కుటుంబ సభ్యులను జనసైనికులతో కలిసి పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి పరామర్శించారు. వారి కుటుంబానికి అన్నివిధాలుగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమ్యుక్త కార్యదర్శి చీకట్ల శ్యామ్ కుమార్, సురాడ శ్రీను, దుర్గాప్రసాద్, సూరాడ ప్రతాప్, వంకా కొండబాబు, మేరుగు ఇశ్రయేలు, మైలపల్లి దావీదు, అంజి, శివ, అజయ్, మణికంఠ, రాజు హేమ, రాజు, రవి, నాని, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.