తెంటు శ్రీకర్‌పై దాడి – ఎస్పీకి రిప్రజెంటేషన్

కురుపాం నియోజకవర్గం, కొమరాడ మండలం విక్రాంపురం పంచాయతీ విక్రాంపురం సచివాలయం పరిధిలో తేది 09-08-2025 శనివారం జనసేన పార్టీ కొమరాడ మండల అధ్యక్షుడు తెంటు శ్రీకర్ పై జరిగిన దాడి మరియు హత్యాయత్నంపై జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ(పిఏసి) సభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీమతి పడాల అరుణ, కురుపాం నియోజకవర్గం సమన్వయకర్త మల్లేశ్వర రావు, గజపతినగరం, చీపురుపల్లి, పార్వతీపురం, నియోజకవర్గం మర్రపు సురేష్, విసినగిరి శ్రీనివాసరావు, ఆదాడ రాంమోహన్, ఉమ్మడి విజయనగరం జిల్లా సీనియర్ నాయకులు బాబు పాలూరు, కురుపాం మార్కెటింగ్ కమిటీ వైస్ చైర్మన్ గార గౌరీ శంకర్రావు, వీర మహిళా గోవిందమ్మ, గజపతినగరం, బొబ్బిలి, నెల్లిమర్ల మండల అధ్యక్షులు మునక్కాల జగన్, సంచన గంగాధర్, పతివాడ అచ్చం నాయుడు, పార్వతీపురం మండల అధ్యక్షులు మరియు పార్వతిపురం పిఎసిఎస్ చైర్మన్ అగురుమని, ఉమ్మడి విజయనగరం జిల్లా కార్య నిర్వహణ కార్యదర్శి దుర్గా ప్రసాద్ దాడిని ఖండిస్తూ పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవ రెడ్డికి రిప్రజెంటేషన్ అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రివర్యులు పడాల అరుణ మాట్లాడుతూ.. ఈ కూటమి ప్రభుత్వంలో వైసిపి పార్టీ చేస్తున్న దాడులను పోలీసు యంత్రాంగం వాటిని అదుపు చేయాలని, ఇలా దారి చేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని సంక్షేమాన్ని చూసి ఓర్వలేక, జనసేన పార్టీ బలపడుతుందన్న ఉద్దేశంతో ఇటువంటి దాడులకు వైసీపీ నాయకులు పాల్పడుతున్నారని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో కురుపాం, పార్వతిపురం, గజపతినగరం, బొబ్బిలి, సాలూరు, పాలకొండ, నియోజకవర్గం, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన పార్టీ లోకల్ సెల్ కేతిరెడ్డి అశోక్, ఖాతా విశ్వేశ్వరరావు, గుంటిరెడ్డి గౌరీ శంకర్, చిట్టి గణేష్, అక్కెన శంకర్రావు, పత్తి గుల్ల ధర్మ, వాసు నాయుడు, వెంకటరమణ, మహేష్, పిడిక రాజేష్, నరసింహ, గణేష్, ఈశ్వర్, పప్పల గోపాలకృష్ణ, అరసాడ ప్రసాదరావు, రవి, అనంత్ కురుపాం నియోజకవర్గ వీర మహిళ గొట్టాపు రేణుక జనసైనికులు కార్యకర్తలు వీరమహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Share this content:

Post Comment