మీడియాపై దాడి చేయడం వైసీపీ రౌడీ మూకల దుర్మార్గం: గురాన అయ్యలు

విజయనగరం, వైఎస్సార్సీపీ నేతల అరాచకాలు రోజురోజుకూ పెచ్చుమీరుతున్నాయి. వారికి వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో జర్నలిస్టులను కూడా వదలటం లేదు. అనంతపురం జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గం సిద్ధం సభలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ శ్రీకృష్ణపై వైఎస్సార్సీపీ కార్యకర్తల దాడికి తెగబడ్డారు. అలాగే ఈ రోజు కర్నూల్ ఈనాడు కార్యాలయంపై దాడి చేశారు. ఇలా తమకు అడ్డొచ్చిన వారందరిపై ఉక్కుపాదం మోపుతూ వైఎస్సార్సీపీ అరాచకాలకు అడ్డే లేదన్నట్లుగా పేట్రేగిపోతున్నారు. మీడియాపైనే దారుణాలకు దిగుతుంటే ఇక సామాన్యులకు రక్షణ ఎక్కడ ఉంటుంది. జర్నలిస్టులపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాము. దాడి చేసిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాం. ప్రజలు అన్ని గమనించి రానున్న ఎన్నికల్లో వైకాపా నాయకులకు బుద్ధి చెప్పాలి. జనసేన-టీడీపీ అభ్యర్ధులను గెలిపించి ప్రజా పాలన రావడానికి సహకరించాలని విజయనగరం జనసేన నాయకులు గురాన అయ్యలు పిలుపునిచ్చారు.