భారత్ కు ఆస్ట్రేలియా భారీ సహాయం..

భారత్ లో సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్నది. సెకండ్ వేవ్ కారణంగా రోజుకు లక్షలాది కేసులు, వేలాది మరణాలు సంభవిస్తున్నాయి. భారత్ లో కరోనా సంక్షోభాన్ని నివారించేందుకు ప్రపంచదేశాలు ముందుకు వస్తున్నాయి. కరోనాపై కలిసికట్టుగా పోరాటం చేసేందుకు సన్నద్ధమయ్యాయి. ఇప్పటికే అనేక దేశాలు సహాయ సహకారాలు అందిస్తున్నాయి. తాజాగా ఈ లిస్ట్ లో ఆస్ట్రేలియా కూడా చేరింది. 100 ఆక్సిజన్ ట్యాంకర్లు, 3 వేల వెంటిలేటర్లు అందిస్తామని ఆస్ట్రేలియా ప్రకటించింది. మొదటి వేవ్ సమయంలో ఆస్ట్రేలియాకు ఇండియా అనేక విధాలుగా సహాయం చేసిందని, ఇప్పుడు ఇండియా ఆపదలో ఉందని, తగిన సహాయం చేస్తామని ప్రకటించింది ఆస్ట్రేలియా.