ఆత్మకూర్ నియోజకవర్గ ప్రజానీకానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు – నలిశెట్టి శ్రీధర్

ఆత్మకూర్ నియోజకవర్గ ప్రజానీకానికి జనసేన పార్టీ ఆత్మకూర్ నియోజకవర్గ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కొత్త సంవత్సరంలో ఆత్మకూర్ పరిధిలోని ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, కోవిడ్, ఒమిక్రాన్ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ నాయకులు శ్రీనివాస్ భరత్, వెంకట రమణ రాయల్, చేజార్ల ఇంచార్జ్ అనిల్ రాయల్, అనంత సాగరం జనసేన సీనియర్ నాయకులు రవి ఉదయగిరి, కార్యనిర్వాహక కార్యదర్శి వంశీ కృష్ణ యాదవ్, సంగం ఇంచార్జ్ రాకేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి మదన్ యాదవ్, మర్రిపాడు జనసేన ప్రధాన కార్యదర్శి సునీల్ యాదవ్, ఆత్మకూర్ టౌన్ నాయకులు సురేంద్ర, వంశీ తదితరులు పాల్గొన్నారు.