టిడిపి కార్యకర్త చెంప చెళ్లుమనిపించిన బాలయ్య

ఎమ్మెల్యే నందమూరి బాలకఅష్ణ మరోసారి తన దురుసు ప్రవర్తనను ప్రదర్శించారు. తన అనుమతి లేకుండా వీడియో తీసినందుకు టీడీపీ కార్యకర్తపై చేయి చేసుకున్నారు. ఈ ఘటన హిందూపురంలో శనివారం చోటుచేసుకుంది. మున్సిపల్‌ ఎన్నికలలో భాగంగా హిందూపురంలోని 9 వార్డులో ఓ ఇంట్లోకి వెళ్లిన బాలయ్య ప్రచారం చేస్తుండగా అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్త వీడియో తీసేందుకు ప్రయత్నించాడు. ఇది చూసి కోపంతో తీవ్ర ఆవేశానికి లోనైన బాలయ్య.. అతనిపై చేయి చేసుకున్నారు. తన అనుమతి లేకుండా వీడియో తీస్తావా అని కార్యకర్త చెంప చెళ్లుమనిపించారు. పర్సనల్‌గా మాట్లాడుతుంటే వీడియో తీస్తావా, వెంటనే డిలీట్‌ చేరు అని మండిపడ్డారు. మరోవైపు బాలయ్య కోపాన్ని చూసిన టీడీపీ శ్రేణులంతా హడలెత్తిపోయారు. మూడు రోజులుగా హిందూపురంలో బాలకఅష్ణ రోడ్‌ షో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పర్యటన మొదటిరోజు కూడా టీడీపీ నేతలపై బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆలయంలో పూజలు నిర్వహించిన తర్వాత మీడియాతో మాట్లాడుతున్న క్రమంలో బాలయ్య హావభావాలు చూసి టీడీపీ నేతలతో పాటు పక్కనే ఉన్న జనాలు నవ్వారు. అందరూ నవ్వడంతో బాలయ్య సీరియస్‌ అయ్యారు. ఇక మూడోరోజు రోడ్‌షోకు ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో అక్కడున్న నాయకులపై బాలయ్య అసహనానికి గురయ్యారు.

హొ బాలయ్య నన్ను టచ్‌ చేసినందుకు గర్వంగా ఉంది: అభిమాని

అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే నందమూరి బాలకఅష్ణ ఓ యువకుడిపై చేయి చేసుకున్నారన్న వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అయితే ఈ ఘటనపై బాలయ్య చేతిలో దెబ్బలు తిన్న యువకుడు స్పందించాడు. బాలయ్య బాబు తనను టచ్‌ చేసినందుకు గర్వంగా ఉందంటూ ఆ యువకుడు ఓ వీడియో విడుదల చేశాడు.