జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ పోస్టర్ ను ఆవిష్కరించిన బండారు శ్రీనివాస్

  • నియోజకవర్గాల వారీగా “జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ – ప్రపంచ ఎన్నారై కలయిక” పోస్టర్ల పంపిణీ కార్యక్రమం

అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గం, “జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ – ప్రపంచ ఎన్నారై కలయిక” జనసేన పార్టీ సింబల్ గాజు గ్లాసును మరియు జనసేన అధినేత చేస్తున్నటువంటి కార్యక్రమాలను ప్రజలలోనికి బలంగా తీసుకెళ్ళేందుకు రూపొందించిన జనంలోకి జనసేన కార్యక్రమంలో భాగంగా పైలట్ ప్రాజెక్ట్ గా జనసేన సింబల్ గాజు గ్లాసుతో కూడిన 15000 పోస్టర్లను ప్రచురించి కొన్ని నియోజకవర్గాలకు పంపిణీ చేయడానికి కార్యాచరణ సిద్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ “జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ – ప్రపంచ ఎన్నారై కలయిక” రూపొందించిన 3 రకాల పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొత్తపేట నియోజకవర్గ జనసేన నాయకులు, జనసైనికులు మరియు శతఘ్ని న్యూస్ వ్యవస్థాపకులు నాయుడు నిమ్మకాయల పాల్గొనడం జరిగింది. అనంతరం బండారు శ్రీనివాస్ మాట్లడుతూ ఎన్నారైలు జనసేనను బలోపేతం చేయడానికి క్షేత్ర స్థాయిలో చేస్తున్న కార్యక్రమాలను కొనియాడడం జరిగింది. అదేవిధంగా శతఘ్ని న్యూస్ ద్వారా జనసేన చేస్తున్న కార్యక్రమాలను అనునిత్యం ప్రజలలోనికి తీసుకెళ్ళడం అభినందనీయమని తెలిపారు.