సైట్ ఇంజనీరుకు వినతిపత్రమిచ్చిన బండి శేఖర్

గుంతకల్, పట్టణంలోని ధర్మవరం గేటు దగ్గర ఉన్నటువంటి సోఫియా కాలనీలో వాటర్ సప్లై కోసం పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ వారు 20 అడుగుల లోతు గుంత తవ్వారు. ఆ గుంత చుట్టూ ఎటువంటి రక్షణ ఏర్పాటు చేయకపోవడంతో ఏడు సంవత్సరాల చిన్నారి ఆ గుంతలో పడి గాయపడింది. ఈ విషయాన్ని గుంతకల్ పట్టణ అధ్యక్షులు జనసేన పార్టీ బండి శేఖర్ సైట్ ఇంజనీర్ ఓబులేసు దృష్టికి తీసుకెళ్లి వెంటనే పనులు పూర్తి చేయాలి, లేదా ఆ గుంతలు పూడ్చేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి వారం రోజుల్లోగా పనులు పూర్తి చేస్తామని గుంత చుట్టూ ఎవరు రాకుండా నోటీసు బోర్డు పెడతామని హామీ ఇవ్వడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *