ముంబైతో తలపడనున్న బెంగళూరు

ఐపిఎల్‌ సీజన్‌ 13లో భాగంగా షేక్‌ జాయెద్‌ క్రికెట్‌ స్టేడియం వేదికగా బుధవారం జరిగే మ్యాచ్‌లో పటిష్ట రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో పోటీ పడనుంది. విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని బెంగళూరు, కీరన్‌ పోలార్డ్‌ సారథ్యంలోని ముంబై అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ లీగ్‌లో ఇది వరకే ఒకసారి ఈ రెండు జట్లు తలపడగా సూపర్‌ ఓవర్‌ రూపంలో బెంగళూరును విజయం వరించింది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించి ప్రతీకారం తీర్చుకోవాలని ముంబై తహతహలాడుతోంది. కాగా, 11 మ్యాచ్‌ల్లో చెరో ఏడు విజయాలతో పాయింట్ల పట్టికలో 1, 2వ స్థానాల్లో ఉన్న ఇరు జట్లూ మరో విజయంతో ప్లే ఆఫ్స్‌ బెర్త్​ను అధికారికంగా ఖరారు చేసుకోవాలని భావిస్తున్నాయి