రాత పరీక్ష లేకుండానే బ్యాంక్ జాబ్స్.. 134 పోస్టులకు IDBI నోటిఫికేషన్..

IDBI నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికిగానూ ఖాళీగా ఉన్న 134 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలుపెట్టింది ఐడీబీఐ. ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఈ పోస్టుల(Jobs 2020)ను భర్తీ చేయనున్నారు. మార్కెటింగ్‌, ఏటీఎం, ట్రేడ్ ఫైనాన్స్‌, ట్రెజరర్, సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్ తదితర విభాగాలలో స్పెషలిస్ట్ కేడర్ ఉద్యోగులు పని చేయాల్సి ఉంటుంది.

మొత్తం పోస్టులు 134

డిప్యూటీ జనరల్ మేనేజర్(గ్రేడ్-డి) – 11 పోస్టులు

అసిస్టెంట్ జనరల్ మేనేజర్(గ్రేడ్-సి) – 52 పోస్టులు

మేనేజర్(గ్రేడ్-బి) – 62 పోస్టులు

అసిస్టెంట్ మేనేజర్(గ్రేడ్-ఎ) – 9 పోస్టులు

ఐడీబీఐ బాంకు ఉద్యోగాల (Bank Jobs)ను బట్టి అభ్యర్థులు ఎలక్ట్రానిక్స్ & టెలీకమ్యూనికేషన్స్‌/ కంప్యూటర్ సైన్స్‌/ ఎలక్ట్రికల్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్ & కమ్యునికేషన్ లేదా ఎంసీఏ లాంటి విద్యార్హత కలిగి ఉండాలి. మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోస్టులకు సైతం ఎంబీఏ, పీజీడీడీఎం, ఏజీఎం చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. అనుభవం, ఇతరత్రా వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌లోకి చూసుకోవాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి

ఎంపిక: దరఖాస్తులలోని అర్హతలు, అనుభవం ఆధారంగా ప్రిలిమినరీ స్క్రీనింగ్, ఆపై షార్ట్ లిస్ట్ అయిన వారిక గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ

ఫీజు: జనరల్, ఈబీసీ అభ్యర్థులు రూ.700, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.150 చెల్లించాలి.

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: ప్రారంభమయ్యాయి

దరఖాస్తుకు చివరి తేది: జనవరి 7, 2021

అధికారిక వెబ్‌సైట్‌: https://www.idbibank.in/