పి. గన్నవరం, డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా, మామిడికుదురు మండలం ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం సుమారు 22 మంది దివ్యాంగులకు బ్యాటరీ సైకిళ్లు, ట్రై సైకిళ్లు, వినికిడి పరికరాలను పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దివ్యాంగుల సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. ఇంకా పరికరాలు అందని వారు మళ్లీ అప్లై చేసుకుంటే త్వరలోనే అందేలా చూస్తాను” అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, దివ్యాంగులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment