పలుకుటుంబాలను పరామర్శించిన బత్తుల దంపతులు

రాజానగరం, కోరుకొండ మండలం, గాదరాడ గ్రామానికి చెందిన చీర్ల సూర్యకాంతం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా… వారి కుటుంబ సభ్యులను బత్తుల బలరామకృష్ణ శ్రీమతి వెంకటలక్ష్మి దంపతులు పరామర్శించి, మనోధైర్యం చెప్పడం జరిగింది. అలానే అదే గ్రామానికి చెందిన మండవరపు చెంతమ్మ ఇటీవల స్వర్గస్తులు కాగా వారి కుటుంబ సభ్యులు మండవరపు సత్యనారాయణ మరియు శ్రీనిలను బత్తుల దంపతులు పరామర్శించారు. గ్రామ నాయకులు దొరక త్రిమూర్తులు, దేవ దుర్గాప్రసాద్(డిడి), మద్దిరెడ్డి బాబులు, వేగిశెట్టి రాజు, నాతిపాం దొరబాబు, అడ్డాల దొరబాబు, తోట అనిల్ వాసు, డి.ఎం.ఎస్ న్యూస్ మణికంఠ స్వామి తదితరులు పాల్గొన్నారు.

రాజానగరం నియోజకవర్గం, సీతారామపురం గ్రామంలో గత వారం సాధిక వరహాలు కు చెందిన 4 గేదెలు, కొన్ని ఆవులు విషపు దాణా తిని మృతి చెందిన విషయం తెలిసిందే… కాగా రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి వెంకటలక్ష్మి దంపతులు ₹50,000/- ఆర్థిక సహాయం ప్రకటించడం.. గురువారం తూర్పుగోనుగూడెం సర్పంచ్ గల్లా రంగా చేతుల మీదుగా చెక్ అందజేసి, మరోసారి ధైర్యం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో అడబాల అదివిష్ణు, శంకరం, మద్దిరెడ్డి బాబులు బాబులు, వేగిశెట్టి రాజు, నాతిపాం దొరబాబు, అడ్డాల దొరబాబు, తోట అనిల్ వాసు, దేనేడి మణికంఠ స్వామి తదితరులు పాల్గొన్నారు.

రాజానగరం నియోజవర్గం, రాజానగరం మండలం, చక్రద్వారబంధం గ్రామ వాస్తవ్యులు జవ్వాది సత్యనారాయణ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా జనశ్రేణుల ద్వారా సమాచారం తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ వారి సతీమణి శ్రీమతి వెంకటలక్ష్మి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, మనోధైర్యం చెప్పి సీనియర్ నాయకులు మద్దిరెడ్డి బాబులు చేతుల మీదుగా కుటుంబ ఖర్చుల నిమిత్తం ₹10,000/-రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది. గ్రామ నాయకులు ఆనందల గోవిందు, కురుమల్ల మహేష్, నాగవరపు శివాజీ, బువ్వతిట్టి శ్రీను, చిటికెన సాయి, నలిమిల్లి వెంకన్న బాబు, పోశెట్టి అయ్యప్ప, ఏఊరి బాలరాజు, చిక్కిరెడ్డి మణికంఠ, భూసంశెట్టి శ్రీను, నాగవరపు శివాజీ, నల్లమిల్లి వెంకన్న బాబు తదితర నాయకులు పాల్గొన్నారు.