జనసేన చొరవతొ కదిలిన స్కూల్ యంత్రాగం

*ఎన్నో నెలల నుండి ఎందరు చెప్పినా పట్టించుకోని యాజమాన్యం, జనసైనికుల మాటకు స్పందించి వెంటనే స్కూల్ ఆవరణ అంతా శుభ్రం చేయించి నీళ్ళ సంపు సరిచేయించటం జరిగింది.

సత్యసాయి జిల్లా, పెనుకొండ నియోజకవర్గం, రొద్దఒ మండలం, నెల్లూరు గ్రామంలో.. ప్రాథమిక పాఠశాల నందు, నీటి సంపు అపరిశుభ్రంగా వుండటం గమనించి జనసేన నాయకులు ఈ విషయాన్ని ప్రధానోపాధ్యాయుల ను ప్రశ్నించగా.. కనీసం తాగునీరు కూడా లేవు అని సమాధానం చెప్పినారు, ఇలాంటి అపరిశుభ్ర సంపు నీరు, చేతులు కడుకోవటానికి మాత్రమే ఉపయోగిస్తాము అని సమాధానం ఇచ్చారు, ఇలాంటి నీటి వలన పిల్లలకు జబ్బులు వస్తే పరిస్థితి ఏంటి అని జనసేన నాయకులు మండి పడ్డారు. వెంటనే మీరు స్పందించి సంపు శుభ్రపరచాలి లేదా మా సొంత డబ్బులతో బాగుచేయిస్తాము అని రెండు రోజులు గడువు ఇవ్వటం జరిగింది. ఎన్నో నెలల నుండి ఎందరు చెప్పినా పట్టించుకోని యాజమాన్యం, జనసైనికుల మాటకు స్పందించి వెంటనే స్కూల్ ఆవరణ అంతా శుభ్రం చేయించి నీళ్ళ సంపు సరిచేయించటం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు సుబ్రమణ్యం, జుబెర్, హరి, వినోద్, రామంజి కార్యకర్తలు పాల్గొనటం జరిగింది.