భారీ విజయం దిశగా “బత్తుల” అడుగులు

  • కలవచర్ల గ్రామంలో వైసీపీ కి బిగ్ షాక్
  • మాజీ గ్రామ ప్రెసిడెంట్ ఎర్ని సత్తిబాబు వైసీపీకి రాజీనామా
  • “బత్తుల” సమక్షంలో జనసేన పార్టీలో చేరిక, ఇదే దారిలో మరి కొంతమంది కీలక నేతలు
  • భారీ విజయంతో రికార్డు సృష్టించే విధంగా “బత్తుల”కు ప్రజా మద్దతు
  • మంచి విజన్ కలిగిన నాయకుడిగా అన్ని వర్గాలను ఆకర్షించడంలో బలరాముడు విజయవంతం
  • అన్ని గ్రామాల్లో “బత్తుల” విజయానికి కలిసొస్తున్న సమీకరణలు
  • అగ్నికి వాయువు తోడైనట్లు “బొడ్డు” “బత్తుల” కాంబినేషన్ సూపర్ హిట్…
  • అందరినీ కలుపుకొని వెళ్లే నేర్పు ఆయన సొంతం
  • ఇప్పటికీ చాలా గ్రామాల్లో పూర్తీగా పట్టు కోల్పోయిన వైసీపీ
  • రాజానగరం నియోజకవర్గం లో వైసిపి కుంభస్థలాన్ని పూర్తిస్థాయిలో కకావికలం చేస్తున్న “బొడ్డు” పిలుపు, “బత్తుల” గెలుపు నినాదం
  • సమిష్టిగా భారీ గెలుపే లక్ష్యంగా ముందుకు కదులుతున్న జనసేన, టిడిపి, బీజేపీ శ్రేణులు
  • రానున్న వారం రోజుల్లో వైసీపీ నుండి మరిన్ని చేరికలతో ఎన్నికలకు ముందే “విజయోత్సవం” చేసుకునే స్థాయిలో కూటమి
  • “బత్తుల బలరామకృష్ణ” సృష్టిస్తున్న జనప్రభంజనానికి చిన్నాభిన్నమైన ‘జక్కంపూడి’ క్యాడర్

రాజానగరం నియోజకవర్గం: రాజానగరం మండలం, కలవచర్ల గ్రామంలో.. గత పంచాయతీ ఎన్నికల్లో 650 పైచిలుకు ఓట్ల తేడాతో భారీ విజయం సాధించి రాజకీయంగా మంచిపట్టున్న ఎర్ని సత్తిబాబు గారు (మాజీ గ్రామ పంచాయితీ ప్రెసిడెంట్, వైసీపీ) సీనియర్ నాయకులు ఓశెట్టి సూర్యచంద్రరావు, అండుబోయిన సింహాచలం, అండుబోయిన రమణ, కొండా వెంకటరమణ అరాచక పాలన చేస్తున్న వైసిపి పార్టీని వీడి.. జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వారందరికీ కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు “బత్తుల”. ఈ కార్యక్రమంలో కలవచర్ల గ్రామ టిడిపి సీనియర్ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.