ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలి..మెగాస్టార్

నందమూరి తారక రామారావుగారికి భారతరత్న ఇస్తే అది తెలుగు వారందరికీ గర్వ కారణం అంటూ.. మెగాస్టార్‌ చిరంజీవి ట్విట్టర్‌ వేదికగా తన కోరికను వెల్లడించారు. నేడు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకొని.. సోషల్‌ మీడియా వేదికగా పలువురు సినీ సెలబ్రిటీలు, అభిమానులు ఆయన్ని స్మరించుకుంటున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి స్పందిస్తూ.. ”ప్రముఖ గాయకులు, నవయుగ వైతాళికులు భూపేన్‌ హజారికా గారికి మరణాంతరం భారతరత్న ఇచ్చినట్లు, మన తెలుగు తేజం, దేశం గర్వించే నాయకుడు నందమూరి తారక రామారావుగారికి భారతరత్న ఇస్తే అది తెలుగు వారందరికీ గర్వ కారణం. వారి నూరవ జన్మదినం దగ్గరపడుతున్న సందర్భంగా ఎన్టీఆర్‌గారికి ఈ గౌరవం దక్కితే అది తెలుగు వారికి దక్కే గౌరవం. ఆ మహానుభావుడి 98 వ జన్మదిన సందర్భంగా వారిని స్మరించుకుంటూ” అని ట్వీట్‌ చేశారు.