నేటి నుంచి తెలంగాణలో సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సిన్ పంపిణీ..

రాష్ట్రం ప్రభుత్వం కరోనా సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాని ప్రారంభించనుంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. నేటి నుంచి మూడు రోజులపాటు కొనసాగనున్న ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా రెండు చోట్ల వ్యాక్సిన్ పంపిణీని మంత్రి ఆరంభిస్తారు. ఇవాళ, రేపు జర్నలిస్టులకు వ్యాక్సినేషన్ ఉంటుంది. హైదరాబాద్‌లో ఐదుచోట్ల ఐదుచోట్ల జర్నలిస్టులకు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు టీకాలు పంపిణీ చేస్తారు. ఇక నిత్యం ప్రజలతో సంబంధాలు కలిగి, వారి అవసరాల తీర్చే దుకాణదారులు, తోపుడు బండ్ల వ్యాపారులు, ఆటో, క్యాబ్‌ డ్రైవర్లు, డెలివరీ బాయ్స్‌, జర్నలిస్టులు తదితరులకు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. వీరికి వ్యాక్సిన్‌ వేయడం ద్వారా కరోనా వైరస్‌ చైన్‌ను తెంచడానికి ఆస్కారం ఉంటుందని అధికారులు గుర్తించారు.