ఆకాల వర్షాల వల్ల దెబ్బతిన్న మిర్చి పంటను పరిశీలించిన జనసేన

తాడికొండ నియోజకవర్గం, మేడికొండూరు మండలం, కొర్రపాడు గ్రామంలో గత కొన్ని రోజుల నుంచి పడుతున్న ఆకాల వర్షాల వల్ల దెబ్బతిన్న కల్లాల మీద ఉన్న మిర్చి పంటను జనసేన పార్టీ పిఏసి సభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా బోనబోయిన మాట్లాడుతూ.. ఉమ్మడి గుంటూరు జిల్లాలో అకాల వర్షాలు వల్ల నష్టపోయిన రైతు కుటుంబాలను పరామర్శించడానికి ఈరోజు ఇక్కడికి వచ్చాము. జనసేన పార్టీ తరఫున మేము మొదటినుంచి కూడా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉంటారు కౌలు రైతులు అప్పుల బాధ ఉండి చనిపోతా ఉంటే కనీసం పట్టించుకోలేని పరిస్థితిలో అధికార పార్టీ ఉంది అయినా కూడా మేము జనసేన పార్టీ ప్రతిపక్ష పార్టీలో ఉండి మేము రైతుల కోసం ఆర్థికంగా సహాయం చేయడానికి ముందుకు వస్తుంటే కనీసం ప్రభుత్వం వారు ఎందుకని ఆదుకోలేకపోతున్నారు. మేము రైతులకు ఆర్ధికంగా ఆదుకుంటున్నాము ఈ విధమైన ఆర్థిక సాయం చేస్తున్నాము. ప్రజల చేత ఎన్నుకోబడిన మీరు అధికారం లో ఉన్న ఇంకే విధమైన సహాయం చేయాలి అని ఆలోచన కూడా చేయలేని పరిస్థితిలో ఈ వైయస్సార్ పార్టీ ఉంది రైతులందరు ఆలోచన చెయ్యండి వచ్చే ఎన్నికల్లో వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలి. గాదె మాట్లాడుతూ పేరుకేమో మాది రైతు ప్రభుత్వం రైతుల కోసం పుట్టిన మా నాన్న రైతులకోసం బతికి చనిపోయాడు మరల నేను రైతుల కోసమే జన్మించానని పెద్ద పెద్ద మాటలు చెప్పే జగన్ రెడ్డి. మీరు అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు అవుతున్నది కానీ ఏ ఒక్క సంవత్సరం రైతుని ఆదుకున్న సందర్భాలు లేవు. వైయస్సార్ పార్టీ వాళ్లు నన్ను నమ్మండి అని మెడలో సంచి వేసుకొని ఇంటింటికి తిరిగి స్టిక్కర్లు అంటించడమా. ఒక పక్కన చేతికి వచ్చిన పంటలను అకాల వర్షాల కారణంగా తడిసి పాడైపోతే అధికార పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ లు గాని ఒక్కరైనా వచ్చి రైతులని పరామర్శించారా.. ఆ పాడైపోయిన పంటను కొనే విధముగా ఏమైనా చర్యలు చేసారా… రైతుకి నష్టం లేకుండా చేస్తారా..? అసలు సబ్సిడీ పై పట్టాలకు రుణాలు ఇస్తారు అలాంటిది ఏ ఒక్కరికి గాని పట్టాలు పంపిణీ చేయడం కానీ సబ్సిడీలపై పట్టాలు ఇప్పించడం కానీ చేయలేదు.. గత ప్రభుత్వం వారు కనీసం పట్టాలు ఇవ్వటం జరిగింది కానీ అధికార పార్టీ లో ఉన్న మీరు ఇప్పటివరకు ఒక్క పట్ట రైతుకి సబ్సిడీపై ఇవ్వలేదంటే ఎంత సిగ్గుచేటు. అకాల వర్షాలు వల్ల తడిసి పాడైపోయిన పంటను మీరు కొని రైతుకి సహాయం చేస్తారా అంటే అది చేయరు దళారి వ్యవస్థ ఉంది అంటే వారు సగానికి సగం కంటే రేటు ఇవ్వమని చెప్పేసి తేల్చేస్తారు. మరి రైతులకి న్యాయం ఎవరు చేయాలి ఎవరు చేస్తారు అధికారంలో ఉన్న మీరు కాదా..?. ఈ విధంగా రైతులను నట్టేట ముంచే పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక్క వైయస్సార్ పార్టీ అని చెప్తున్నాము. మీరు అధికారంలో వచ్చి నాలుగు సంవత్సరాలు అవుతున్న ఇప్పటివరకు కొన్ని వందల శిలాఫలకాలు వేసుకొని వాటిని పరదాలు చాటున వెళ్లి ప్రారంభించడమే తప్పా… ఏ ఒక్క కంపెనీ కానీ,ఫ్యాక్టరీ కానీ అలాగే మా హయాములో ఒక ప్రాజెక్టు కట్టాము అని గాని ప్రారంభం ఏమైనా చేసావా..?. తక్షణమే మీరు సమీక్ష పెట్టండి ఈ రైతుని ఆదుకోండి. రైతులకి నష్టపరహారం ప్రకటించండి లేనిపక్షంలో మీరు ఇంటింటికీ తిరిగి అంటిస్తున్న స్టిక్కర్లు పీకేసి రైతులకి న్యాయం జరిగే వరకూ జనసేన పార్టీ అండగా ఉండి అవసరమైతే ధర్నాలు చేస్తామని హెచ్చరిస్తున్నాము.పొన్నూరు నియోజకవర్గం చేకూరు గ్రామంలో ఒక కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు దేనికి గత సంవత్సరం వడ్లు తడిచిపోయి నష్టపోయాడు. ఇప్పుడు మొక్కజొన్న తడిసిపోయి నష్టపోయాడు ఈ నష్టాన్ని భరించలేక నిన్న ఆత్మహత్య చేసుకున్నాడు దయచేసి అధికార పార్టీ వారు గమనించి ఏ ఒక్క రైతుకు చనిపోకుండా, నష్టం లేకుండా చేయాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మండల కమిటీ సభ్యులు గ్రామ కమిటీ సభ్యులు జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.