బిగ్ బాస్ ఫేమ్ సామ్రాట్ రెండవ వివాహం

బిగ్ బాస్ కంటెస్టెంట్ సామ్రాట్ రెడ్డి రీసెంట్‌గా రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయాన్ని ఆయన సోదరి శిల్పారెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించింది.  క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో అలరించిన సామ్రాట్, బిగ్ బాస్ రియాలిటీ షో బిగ్ బాస్ రెండవ సీజన్లో అందరి దృష్టిని ఆకర్షించి ఫెమస్ అయ్యాడు.  సామ్రాట్ ఎలాంటి హడావిడి లేకుండా కొంతమంది బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి చేసుకుని శ్రీ లిఖిత అనే అమ్మాయిని తన జీవితంలోకి ఆహ్వానించాడు. ఈ వివాహ వేడుక కర్ణాటకలో జరిగింది. ఇరువురు కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో జరిగిన శుభ వేడుకకి బిగ్ బాస్ రెండవ సీజన్లో కంటెస్టెంట్లుగా వచ్చిన తనీష్, దీప్తి సునైన హాజరయ్యారు. కరోనా నిబంధనల మేరకు అన్ని జాగ్రత్తలు పాటిస్తూ వివాహ వేడుక జరిగిందట. గతంలో హర్షిత అనే అమ్మాయిని వివాహం చేసుకున్న సామ్రాట్, ఆ తర్వాత కొంత కాలానికి ఆమెతో తన బంధాన్ని విడదీసుకున్నాడు. ప్రస్తుతం శ్రీ లిఖితతో రెండవ వివాహం చేసుకున్నాడు. బిగ్ బాస్ తో పాపులర్ అయిన సామ్రాట్, సినిమాల్లోనూ కనిపించాడు.