బిగ్ బాస్ బ్యూటీ దివికి వరుస సినిమా ఆఫర్లు..

బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి పాపులర్ అయినా వాళ్ళు చాలామందే ఉన్నారు. ఇదే క్రమంలో తాజాగా బిగ్ బాస్ సీజన్ 4లో ఎంట్రీ ఇచ్చిన అందాల భామ దివికి కుడా వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయట. పలువురు దర్శక నిర్మాతలు ఈ అమ్మడి తో సినిమా చేయాలనీ ప్రయత్నిస్తున్నారట. ఇప్పటికే కొంతమంది దివీని సంప్రదించారని తెలుస్తుంది. అలానే రెండు సినిమాల్లో హీరోయిన్ గా దివికి ఛాన్స్ వచ్చిందని అంటున్నారు. మరి ఈ చిన్నది ఎవరి సరసన హీరోయిన్ గా చేయబోతుందో చూడాలి. ఈ రెండు సినిమాలకు సంబంధించిన వివరాలు త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని ఫిలిం నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.