యూపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం.. యోగికి మోదీ అభినందనలు

ఉత్తరప్రదేశ్ స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘన విజయంపై ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, పార్టీ కార్యకర్తల కృషి ఫలితంగానే ఈ విజయం సాధ్యమైందన్న మోదీ.. సీఎం యోగి, యూపీ ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి, ప్రజాసేవ, న్యాయమైన పాలనను ప్రజలు ఆశీర్వదించారని పేర్కొన్నారు.

రాష్ట్రంలోని 75 జిల్లా పంచాయతీలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ మద్దతుదారులు 67 జిల్లా పంచాయతీలను కైవసం చేసుకున్నారు. సీఎం యోగి, ప్రధాని మోదీ పాప్యులారిటీతోపాటు ప్రజా సంక్షేమ విధానాలే పార్టీకి విజయాన్ని కట్టబెట్టాయని పేర్కొన్న యూపీ బీజేపీ అధ్యక్షుడు స్వతంత్రదేవ్ సింగ్.. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు.