క్షమాపణలు కోరిన ఖుష్బూ

నటి, భాజపా నాయకురాలు ఖుష్బూ సుందర్ కాంగ్రెస్‌ నుంచి వైదొలగి సోమవారం భాజపాలో చేరిన విషయం తెలిసిందే. అనంతరం చెన్నైలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మానసిక పరిపక్వతలేని కాంగ్రెస్‌ నుంచి వైదొలగినట్లు చెప్పారు. ఈ వ్యాఖ్యలపై ఆరోపణలు వచ్చాయి. దివ్యాంగులను అవమానించినట్లు దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక పేర్కొంది. చెన్నై, కాంచీపురం, కోయంబత్తూర్‌, చెంగల్‌పట్టు, మదురై, తిరుప్పూర్‌ జిల్లాల్లో తదితర 30 పోలీస్‌స్టేషన్లలో, చెన్నై కమిషనరేట్‌లో కూడా ఆమెపై ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలపై నటి ఖుష్బూ క్షమాపణలు చెప్పారు. తీవ్రమైన వేదనతో ఓ క్షణంలో కొన్ని పదాలను తప్పుగా ఉపయోగించినందుకు క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నారు. దివ్యాంగులను కించపరచాలన్నది తన ఉద్దేశం కాదన్నారు.