పాయకరావుపేటలో నిరుపేదలకు జనసేన దుప్పట్లు

• ఘనంగా జనసేనాని జన్మదిన వేడుకలు
• జనసేనలోకి సీనియర్ రాజకీయ వేత్త

విశాఖ జిల్లా, పాయకరావుపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్ని పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. నియోజకవర్గం వ్యాప్తంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్, సీనియర్ నాయకులు గెడ్డం బుజ్జిల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు, కేక్ కటింగ్ లు చేశారు. నక్కపల్లి మండల కేంద్రంలో వదత్ ఆధ్వర్యంలో నిరుపేదలకు పవన్ కళ్యాణ్ పేరు మీద దుప్పట్లు పంపిణీ చేశారు. ఎస్. రాయవరం మండలంలో జరిగిన వేడుకల్లో పెద్దగుములూరుకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు, మండలంలో అత్యంత ప్రభావవంతమైన నాయకుల్లో ఒకరు అయిన కేతవరకు భానుమూర్తి జనసేన పార్టీలో చేరారు. బోడపాటి శివదత్ ఆయనకు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీని క్షేత్ర స్థాయికి తీసుకువెళ్లడంతో భానుమూర్తి లాంటి నాయకుల కృషి అవసరం అని ఈ సందర్భంగా శివదత్ తెలిపారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.