వితంతువుకు పెన్షన్ రావడంలో సహాయం చేసిన వీరమహిళ బోడపాటి రాజేశ్వరి

వితంతు పెన్షన్ నిలిపివేతపై ప్రభుత్వ అధికారుల తీరుపై మండిపడ్డ జనసేన వీరమహిళ జిల్లా ప్రధాన కార్యదర్శి బోడపాటి రాజేశ్వరి!

తూర్పుగోదావరి జిల్లా, రాజమండ్రి రూరల్, కడియం మండలంలోని, పొట్టిలంక గ్రామానికి చెందిన వీరగనుకులనే వితంతు మహిళ, తన భర్త 25 సంవత్సరాల క్రితం చనిపోతే, ఐదు నెలల కిందటి వరకు పెన్షన్ వచ్చేది! కానీ ఏవో కుంటి సాకులు చెబుతూ ఆమె వితంతు పింఛన్ను అధికారులు ఈమధ్య కొద్ది రోజుల క్రితం తీసివేశారు. కారణం ఏమిటంటే ఆమె భర్త చనిపోయిన డెత్ సర్టిఫికెట్ కావాలని కోరడంతో ఆమె అవాక్కై, నిస్సహాయ స్థితిలో ఉన్న ఆమెను అదే గ్రామానికి చెందిన జనసేన పార్టీ వీరమహిళ జిల్లా ప్రధాన కార్యదర్శి బోడపాటి రాజేశ్వరి తన అనుచరులతో ఏదో విధంగా మొత్తం మీద ఆమెకు డెత్ సర్టిఫికెట్ నమోదు చేయించి పత్రము తీసుకువచ్చారు. ఈ విషయాన్ని రాజేశ్వరి ప్రెస్ కు తెలియజేస్తూ, ఎంతోమంది ఎన్నో విధాలుగా ఇటువంటి వారు ఇబ్బందులు పడుతూ చాలా మంది అనేక గ్రామాల్లో ఇంకా ఉన్నారని, వాలంటీర్ వ్యవస్థ దేనికి ఉన్నదని, ఇలాంటి వారిని బాధ పెట్టడం ఎంతవరకు న్యాయమని, కొన్ని ప్రభుత్వ విధానాలను తప్పుపడుతూ, ప్రభుత్వ పాలనలో లోపాలను, అవినీతి సమస్యలను, సూటిగా ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డికి సంధించారు, అధికారుల లోపాలను ఎత్తి చూపుతూ ఆమె ప్రెస్ మీడియాకు తెలియజేసినారు. ఈ విషయం మీద పలువురు పేద ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ సమాజంలో ఇలా నిలదీసే వారు ఉండాలని, సమస్యల మీద స్పందించి నేతలు ముందుకు రావాలని, ఇలాంటి వారు ప్రశ్నించడానికి ముందుకు వస్తే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని పలువురు గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు.