అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి అండగా బొలిశెట్టి

తాడేపల్లిగూడెం, పట్టణంలో 1 వ వార్డు మిలటరీ కాలనీలో శుక్రువారం నాడు అగ్ని ప్రమాదనికి గురి అయిన వట్టి పులుసు చరణ్ సింగ్ ఇల్లుని పరిశీలించి బొలిశెట్టి శ్రీనివాస్ వారి కుటుంబానికి జనసేన పార్టీ తరుపున అండగా ఉంటామని చెప్పి తక్షణ సాయం కింద 20,000 అందజేశారు. అనంతరం ఆ ఇంటిని పునర్నిర్మాణం కోసం సహకరిస్తామని బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన పార్టీ తరఫున భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన తాడేపల్లిగూడెం పట్టణ, రూలర్, పెంటపాడు మండల నాయకులు జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.