తల్లిపాలే ఆరోగ్యకరమైన శిశువుల భవిష్యత్తుకు పునాది

*మంత్రి సంధ్యారాణి

సాలూరు, శిశువుల ఆరోగ్య భవిష్యత్తు తల్లిపాలపై ఆధారపడి ఉంటుందని, అవి జీవనాధారమని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవం సందర్భంగా గురువారం సాలూరులో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “తల్లిపాలు శిశువుకు ప్రకృతివిచ్చిన మొదటి ఆహారం. డయేరియా, నిమోనియా వంటి వ్యాధుల నుండి రక్షణను కలిగించడంతో పాటు, శిశువు ఎదుగుదలకు కావలసిన పోషకాలను పూర్తిగా అందిస్తాయి” అని పేర్కొన్నారు. పుట్టిన 30 నిమిషాల్లో ఇచ్చే ముర్రుపాలు బిడ్డకు టీకాలా రక్షణను కలిగిస్తాయని వివరించారు. తల్లిపాల వల్ల తల్లులకు కూడా ఆరోగ్య ప్రయోజనాలున్నాయని చెప్పారు. 6 నెలల వరకు ఎక్స్‌క్లూసివ్ బ్రెస్ట్‌ఫీడింగ్, అనంతరం రెండేళ్ల వరకు కొనసాగించాల్సిన అవసరముందని సూచించారు. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాలపై అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా తల్లి పాలకోసం బస్ స్టాండ్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రత్యేక గదులు ఏర్పాటు చేయాలని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీలకు అవసరమైన వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.

WhatsApp-Image-2025-08-07-at-4.51.15-PM-1-1024x683 తల్లిపాలే ఆరోగ్యకరమైన శిశువుల భవిష్యత్తుకు పునాది

Share this content:

Post Comment