*బొలిశెట్టి దేవిప్రియ
తాడేపల్లిగూడెం: ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాం నెం.3 వద్ద చంటి పిల్లల తల్లుల కోసం ప్రత్యేక గదిని, పిల్లల ఊయలలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బొలిశెట్టి దేవిప్రియ మాట్లాడుతూ.. “తల్లి పాలే బిడ్డకు ఆరోగ్యపు ఆధారం. తొలివేసిన ఆరు నెలలపాటు తల్లి పాలు తప్పనిసరిగా ఇవ్వాలి. బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల పిల్లలు డయాబెటిస్, ఒబెసిటీ లాంటి సమస్యల నుంచి దూరంగా ఉండే అవకాశముంది” అని అన్నారు. ఈ కార్యక్రమాన్ని పశ్చిమ గోదావరి కలెక్టర్ ఆదేశాలతో మహిళా శిశు సంక్షేమ శాఖ వారు నిర్వహించారు. లయన్స్ క్లబ్ సహకారంతో, వదిలివేయబడిన చిన్నారుల కోసం రెండు ఊయలలను కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దేవిప్రియ మాట్లాడుతూ.. “తల్లి పాలతో తల్లీ బిడ్డల మధ్య అనుబంధం బలపడుతుంది. ప్రపంచ దేశాలు కూడా తల్లి పాలపై అవగాహన పెంపొందించేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నాయి” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి, ఐసిడీఎస్ సీడీపీఓ లక్ష్మి సరస్వతి, సూపర్‌వైజర్లు, రైల్వే స్టేషన్ మాస్టర్, మెడికల్ సిబ్బంది, కళ్ల గోపికృష్ణ, లయన్స్ క్లబ్ సభ్యులు, జనసేన నేతలు కసిరెడ్డి మధులత, పుల్ల బాబి, చాపల మంగాబాయ్, కామిశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున తల్లులు తమ చిన్నారులతో హాజరయ్యారు.

Share this content:
Post Comment