రేఖాగౌడ్ జన్మదిన వారోత్సవాల్లో భాగంగా తొలిరోజు స్థానిక మానసిక వికలాంగుల కేంద్రంలో బన్ను, బిస్కెట్ పంపిణీ

ఎమ్మిగనూరు, జనసేన నియోజకవర్గ ఇన్చార్జి రేఖ గౌడ్, రానున్న పుట్టినరోజును పురస్కరించుకొని జన్మదిన వారోత్సవాల్లో భాగంగా తొలిరోజు స్థానిక మానసిక వికలాంగుల కేంద్రంనందు పిల్లలకు బన్ను, బిస్కెట్, పంపిణీ చేసారు. ఈ సందర్భంగా మండల అధికార ప్రతినిధి రాహుల్ సాగర్, రాష్ట్ర చేనేత రికార్డ్ రాష్ట్ర కార్యదర్శి రవి ప్రకాష్, వెంకటేష్ లు మాట్లాడుతూ మా నాయకురాలు పుట్టినరోజు వేడుకలు పిల్లల మధ్య జరుపుకోవడం ఎంతో సంతోషాన్నిచ్చిందని మాకు తోచిన విధంగా సహాయం చేయడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని రాబోయే రోజుల్లో మరిన్ని ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వినయ్, రమేష్, షబ్బీర్, రషీద్, గోపి తదితరులు పాల్గొన్నారు.