జనసైనికునికి ప్రమాద భీమా చెక్కుని అందజేసిన చేగొండి సూర్యప్రకాష్

ఆచంట నియోజకవర్గం, ఆచంట మండలం కోడేరు గ్రామంలో జరిగిన సమావేశంలో జనసైనికునికి ప్రమాద భీమా చెక్కుని బుధవారం అందించడం జరిగింది. వివరాల్లోకి వెళితే మూడు నెలల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్రామానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు యర్రంశెట్టి వెంకటేశ్వరరావు కాలుకి తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరగా కాలికి శస్త్రచికిత్స చేసి స్టీల్ రాడ్లను అమర్చడం జరిగింది. ఈ విషయాన్ని కోడేరు జనసేన నాయకులు కుంపట్ల రమేష్ రాష్ట్ర జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి తెలియపరచగా వారు కుంపట్ల రమేష్ మరియు వెంకటేశ్వరరావులను సంప్రదించి వెంటనే వెంకటేశ్వరరావు వైద్యం నిమిత్తం ప్రమాద భీమా క్రింద 22278/- రూపాయలు మంజూరు చేశారు. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం బుధవారం ఆచంట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ చేగొండి సూర్యప్రకాష్ కోడేరు గ్రామ సభను ఏర్పాటు చేసి జనసేన నాయకులు, కార్యకర్తల మరియు గ్రామస్తుల సమక్షంలో ఆ చెక్కును యర్రంశెట్టి వెంకటేశ్వరరావుకి వారి కుటుంబ సభ్యుల సమక్షంలో అందించారు. ఈ కార్యక్రమానికి ఆచంట మండల అధ్యక్షులు శ్రీ జవ్వాది బాలాజీ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ వెంగళదాసు దానయ్య, జిల్లా సెక్రటరీలు చిట్టూరి శ్రీనివాస్, అడ్డాల కనకదుర్గారావు, మండల ఉపాధ్యక్షులు ఎర్రగొప్పుల నాగరాజు, జిల్లా జాయింట్ సెక్రటరీ రావి హరీష్ బాబు, నంబుారి విజయ్, కోడేరు గ్రామ జనసేన పార్టీ నాయకులు కుంపట్ల రమేష్, మండల జనసేన పార్టీ నాయకులు నిమ్మన శేఖర్, సలాది పెద్దిరాజు, లక్ష్మణ్, పాలకొల్లు జనసేన నాయకులు అంబటి విజయ్ కుమార్ మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.