ఆదివాసి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించండి!

*ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పిలుపు

పోలవరం, ఏలూరు జిల్లా, ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 9, శనివారం కే.ఆర్.పురం ఐటీడీఏ పరిధిలో నిర్వహించనున్న “ఆదివాసి పండుగ”ను విజయవంతం చేయాలని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
“గిరిజనుల జీవనశైలి, వారి సంస్కృతి, ఆచారాలను ప్రతిబింబించే ఈ పండుగను అత్యంత వైభవంగా నిర్వహించాలని కోరుతున్నాం. ఇది ఆదివాసీ హక్కులను గుర్తుచేసే గొప్ప వేదిక. నియోజకవర్గంలోని ప్రతి గిరిజన కుటుంబం నుండి కనీసం ఒకరు కార్యక్రమానికి హాజరయ్యేలా ఏర్పాట్లు చేయాలి. రవాణా, భద్రత, తాగునీరు, శౌచాలయాలు, వైద్యం వంటి మౌలిక వసతులు అన్ని సులభంగా అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను సూచించాను” అని తెలిపారు. కార్యక్రమానికి మంత్రి, ప్రజాప్రతినిధులు, గిరిజన సంఘాల నేతలు, అధికారులు హాజరయ్యే అవకాశముందని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్క శాఖ సమన్వయంతో పనిచేయాలని, ఎలాంటి అర్బుదాలు లేకుండా వేడుకలు సజావుగా సాగేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతేకాక, గిరిజన విద్యార్థులకు ప్రోత్సాహకంగా స్కాలర్‌షిప్లు, హాస్టళ్లు, ప్రత్యేక పాఠశాలల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఎమ్మెల్యే వివరించారు. ఆదివాసీల అభివృద్ధే మనకు ప్రాధాన్యమని ఆయన పేర్కొన్నారు.

Share this content:

Post Comment