చిన్న మొత్తాల పొదుపు ఖాతాలపై వడ్డీరేట్లు యథాతథం: కేంద్రం

ఆర్థికశాఖ జారీ చేసిన ఆదేశాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. చిన్న మొత్తాల పొదుపు ఖాతాలపై వడ్డీరేట్లు యథాతథంగా కొనసాగుతాయని తెలిపారు. అంతేగాకుండా.. ఇప్పటివరకూ అమలవుతున్న వడ్డీరేట్లు సైతం కొనసాగుతాయని పేర్కొన్నారు.