ఆన్‌లైన్ ఛానల్స్‌ ఓపెన్‌కు కేంద్రం అనుమతి తప్పనిసరి

డిజిటల్ న్యూస్ మీడియా లో ఇప్పటివరకూ ఎవరైనా ఆన్‌లైన్ డిజిటల్ మీడియా ద్వారా కంటెంట్ అందించవచ్చు. న్యూస్ పోర్టల్స్ మాత్రమే కాదు.. యూట్యూబ్ వంటి అనేక డిజిటల్ వీడియో కంటెంటర్లు కూడా ఎలాంటి అనుమతులు లేకుండా సింపుల్ గా కంటెంట్ క్రియేట్ చేసుకునే అవకాశం ఉంది. ఇకపై ఆ అవకాశం లేదు.. ఓటీటీ వంటి స్ట్రీమింగ్ కంటెంట్ ప్రొవైడర్లు కూడా అనుమతి తీసుకోవాల్సిందే. ఆన్‌లైన్‌ న్యూస్‌ పోర్టల్స్‌, కంటెంట్‌ అందించే సంస్థలను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకువస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. వీటిని సమాచార, ప్రసార శాఖ పరిధిలోకి తీసువస్తూ తాజాగా నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌పై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సంతకం చేశారు. ఓటీటీలో పెరిగిపోతున్న అశ్లీలత కట్టడిక మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్‌ తదితర పలు సంస్థలు కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోకి చేరినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. సినిమాల విషయంలో సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ)కి అధికారాలుండగా.. ప్రకటనలకు సంబంధించి అడ్వర్టయిజింగ్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా నియంత్రణ బాధ్యతలు చూస్తోంది.