చార్‌ధామ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత..

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఇక భారత వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసింది. మరింత భారీ వర్షాలు కురవనున్నట్లు ఐఎండీ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో చార్‌ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామి .. వర్షాలపై సమీక్ష నిర్వహించారు. రుద్రప్రయాగ్ అధికారులతో ఆయన చర్చించారు. కేదార్‌నాథ్ ఆలయం వద్ద ఆదివారం ఆరు వేల మంది భక్తులు ఉన్నారని, వారిలో 4 వేల మంది తిరిగి వచ్చినట్లు రుద్రప్రయాగ్ డీఎం తెలిపారు. మరో రెండు వేల మంది భక్తులు సురక్షిత ప్రదేశంలో ఉన్నట్లు ఆయన సీఎంకు చెప్పారు.