గొల్లపేట ప్రాంతంలో చైతన్య యాత్ర

కాకినాడ సిటిలో స్థానిక జగన్నధపురంలోని 22వ డివిజన్ లోని గొల్లపేట ప్రాంతంలో గురువారం యాదవ చైతన్య యాత్ర కార్యక్రమం ఎం. శివాజె యాదవ్ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగినది. ఇందులో జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు మరియు సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముత్తా శశిధర్ మాట్లాడుతూ బలహీన వర్గాల అభ్యున్నతికోసం కార్యక్రమాలను చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్న ఈ వై.సి.పి ప్రభుత్వం గేదల పంపిణీ పధకం సంబంధించిన కుంభకోణంపై యాదవులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. దొంగలను పట్టుకోవాలిసిన ప్రభుత్వాలు దొంగతనాలు చేస్తే ప్రజలకు ఇంకేమి నీతులు చెపుతారని ప్రశ్నించారు. ఒకటి కాదు రెండుకాదు సుమారు రెండువేల కోట్లు విలువైన పశుసంపదని కాయితాలపై పుట్టించి మింగేసారనీ ఇంద్రజాలంలో పి.సి సర్కార్ కన్నా పేద్ద సర్కార్ ఈ వై.సి.పి సర్కార్ అని వ్యంగంగా అంటూ, ఇదేనా బలహీన వర్గాలమీద ఈ ముఖ్యమంత్రికి ఉన్న ప్రేమ అని అన్నారు. పొద్దు లేస్తే ఇలాంటి దొంగతనాలు, దౌర్జన్యాలు తప్ప సాధించిన ప్రగతి ఒక్కటంటే ఒక్కటైనా చెప్పగలరా ఈ వై.సి.పి ప్రభుత్వం అని చాలెంజ్ చేసారు. ఈ ముఖ్యమంత్రికి ఆత్మస్థుతి పరనిందా తప్ప మరో పని లేదని దునుమాడారు. రానున్న రోజుల్లో తాము తెలుగుదేశం పార్టీలు ఉమ్మడిగా కార్యాచరణ మొదలెడుతున్నామనీ, ఈ వై.సి.పి ప్రభుత్వానికి ఇక మోతే మోత అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా సమ్యుక్త కార్యదర్శి బడే క్రిష్ణ, జనసేన నాయకులు మడ్డు విజయ్, సుంకర సురేష్, సిద్ధు, సత్యన్నారాయణ, సత్తిబాబు, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.