పవన్ కళ్యాణ్ తో చేగొండి హరిరామజోగయ్య భేటీ

జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో సీనియర్ నేత, మాజీ హోమ్ శాఖ మంత్రి, కాపు సంక్షేమ సేన అధ్యక్షులు శ్రీ చేగొండి హరిరామజోగయ్య గారు సమావేశమయ్యారు. వర్తమాన రాజకీయ అంశాలు, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించాలని శ్రీ హరిరామజోగయ్య గారు అభిలషించారు.